రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నాగర్కర్నూల్ జిల్లా విద్యార్థి ప్రతిభ

లోకవాణి, నాగర్కర్నూల్రా : వరంగల్ జిల్లా హనుమకొండ లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మే 10న జరిగిన తెలంగాణ అథ్లెటిక్స్ పోటీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా విద్యార్థి నవీన్ జావెలిన్ త్రో విభాగంలో బ్రౌన్ మెడల్ సాధించాడు. లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్‌కు చెందిన నవీన్‌ను జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించారు. కోచ్ రాణా మల్లేష్ మాట్లాడుతూ నవీన్ జాతీయస్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. నవీన్ విజయంపై తల్లిదండ్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe