లోకవాణి, అచ్చంపేట: పదర మండలంలోని వంకశ్వరం గ్రామంలో 2026 జనాభా గణన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ సర్వే విధానాన్ని రాష్ట్ర గణాంక కార్యాలయం హైదరాబాద్‌కు చెందిన సెన్సస్ కన్సల్టెంట్ దయానందం, అసిస్టెంట్ డైరెక్టర్ అర్ధనారి స్వామి, ఎస్‌వో నరసింహస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కె. సురేష్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎండీ వసీమ్ అక్రమ్, సెన్సస్ సిబ్బంది, సూపర్వైజర్లతో సమావేశమై సర్వే నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ, సర్వే పనులను నిర్ణీత గడువులో సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సెన్సస్ సూపర్వైజర్ ఎండీ బురాన్, ఎన్యుమరేటర్లు రాంజీ, బాలమ్మ, వసంత, సెన్సస్ ఎగ్జిక్యూటివ్ కె. రిషిత్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ నరేందర్, గ్రామ సర్పంచ్ మౌనిక, ఉప సర్పంచ్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జనాభా గణన సర్వే పనులను పరిశీలించిన రాష్ట్ర గణాంక శాఖ అధికారులు
13
May
WhatsApp
Join Now
Youtube
Subscribe
