రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో అచ్చంపేట విద్యార్థుల ప్రతిభ

లోకవాణి, అచ్చంపేట : రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో అచ్చంపేట విద్యార్థుల ప్రతిభ చాటారు. ఈ నెల 9, 10 తేదీలలో రంగారెడ్డి జిల్లాలోని ఇండోర్ క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో అచ్చంపేట విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడిన విద్యార్థులు పలు పతకాలు సాధించి అచ్చంపేటకు మంచి పేరు తీసుకువచ్చారు. కార్తీక్, రోహిత్, శశికాంత్ గోల్డ్ మెడల్స్ సాధించి తమ ప్రతిభను చాటుకోగా, దుర్గా మరియు వి. కార్తీక్ సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. రుద్రాక్ష్ నాయక్, అక్షిత్ బ్రాంజ్ మెడల్స్ సాధించి ప్రశంసలు అందుకున్నారు.

పోటీలలో విజయం సాధించిన విద్యార్థులను జిల్లా కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు రాజు నాయక్, కార్యదర్శి శివ, ట్రెజరర్ జ్యోతి రాజు అభినందించి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, కోచ్‌ల శిక్షణ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe