ఉపాధి హామీ కూలీల సమ్మెను జయప్రదం చేయాలి: చింతల నాగరాజు

లోకవాణి, అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం సదగోడు గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు కూలీలను ఉద్దేశించి మాట్లాడారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎంఎస్ యాప్‌లో రెండు ఫోటోల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. మే 15న జరిగే ఉపాధి హామీ కూలీల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, కూలీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe