లోకవాణి, అచ్చంపేట: లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 2007-08 విద్యా సంవత్సరపు 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. తమ ఎదుగుదలకు గురుకుల పాఠశాల, ఉపాధ్యాయుల కృషి ఎంతో దోహదపడిందని తెలిపారు. ఉపాధ్యాయులను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి సహకరిస్తూ సేవా కార్యక్రమాలు చేపడతామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
