అచ్చంపేట : హిందూ సమ్మేళనానికి కరపత్రాల పంపిణీ

లోకవాణి, అచ్చంపేట : అచ్చంపేటలో పట్టణంలోని చంద్రారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏప్రిల్ 3న హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శ్రీ భ్రమరాంబ దేవాలయం లో మంగళవారం దేవాలయం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హిందూ ప్రజలు హాజరై హిందూ ఐక్యతను చాటాలని కోరారు. హిందూ బంధువులందరూ తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe