పిడుగు పాటుకు ఎద్దు మృతి.. రైతును ఆదుకోవాలని విజ్ఞప్తి

లోకవాణి, అచ్చంపేట 21 : రాత్రి కురిసిన అకాల భారీ వర్షం, గాలివాన, ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు ప్రభావానికి ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గ్రామానికి చెందిన రైతు ఎడ్ల తిరుపతయ్యకు చెందిన కడెద్దు మృతి చెందింది. మృతి చెందిన పశువు విలువ సుమారు రూ.70 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి రైతును ఆదుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe