లోకవాణి, అచ్చంపేట: నల్లమల ఆణిముత్యం కార్తీక్‌కు స్టేట్ 30వ ర్యాంక్ సాధించాడు. ఆదివారం విడుదలైన ఎఫ్‌సెట్ ఫలితాల్లో లింగాల మండలం కొత్తగుంటపల్లికి చెందిన యాట కార్తీక్ రాష్ట్ర స్థాయిలో 30వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఉన్నత స్థాయికి చేరాలనే లక్ష్యంతో కృషి చేసి ఈ విజయాన్ని అందుకున్నాడు. కార్తీక్ సాధించిన ర్యాంక్ గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువకులు అతన్ని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
