లోకవాణి, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని నడింపల్లి పాఠశాలలో స్వీపర్‌గా గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలందించిన గిద్దె బాలమ్మ లక్ష్మయ్య పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం అర్జునయ్య మాట్లాడుతూ, బాలమ్మ లక్ష్మయ్య అంకితభావంతో, నిబద్ధతతో పాఠశాల పరిశుభ్రతను కాపాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించారని కొనియాడారు. ఆమె సేవలు పాఠశాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.
ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సామ్య నాయక్ మాట్లాడుతూ, చిన్నదైన పనిగా భావించకుండా విద్యా వ్యవస్థలో భాగంగా బాధ్యతాయుతంగా పని చేసిన ఆమె ప్రతి ఉద్యోగికి ఆదర్శమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ గోపి పద్మ, డిప్యూటీ సర్పంచ్ కాశీం, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొని బాలమ్మ లక్ష్మయ్యకు ఘనంగా అభినందనలు తెలిపారు.
