అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో STUTS 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

లోకవాణి న్యూస్, అచ్చంపేట : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో STUTS రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం కార్యకలాపాలు, ఉపాధ్యాయుల హక్కులు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఉపాధ్యాయుల ఐక్యతతో ముందుకు సాగాలని, విద్యా రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుర చైర్మన్ము శ్రీనివాసులు, STUTS సంఘం నాయకులు పాల్గొన్నారు. .

WhatsApp Join Now
Youtube Subscribe