లోకవాణి, అచ్చంపేట : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మండల ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
అచ్చంపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆధ్యాత్మిక విలువలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ క్యాలెండర్ను విడుదల చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షులు కొరివి చంద్రశేఖర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసుల, ఆలయ కమిటీ సభ్యులు, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బంధం పరమేశ్వర ప్రసాద్, కోశాధికారి వీరబ్రహ్మం చంద్రశేఖర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
