ఉప్పునుంతల ప్రభుత్వ ఆస్పత్రి సేవలపై సమీక్ష సమావేశం


లోకవాణి, ఉప్పునుంతల: నాగకర్నూల్  జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గ్రామ సర్పంచ్ చింతగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆస్పత్రి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, డెలివరీ కేసులు, యంత్రాల వినియోగం, మందుల లభ్యత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వైద్యులు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. రోగులతో మర్యాదగా, ప్రేమతో వ్యవహరించాలని కోరారు. అనంతరం వైద్యులు సర్పంచ్, మండల అధ్యక్షులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దలు కట్ట అనంత రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe