లోకవాణి, అచ్చంపేట 30: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతా రామచంద్ర మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చన పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందారు. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల ద్వారా భక్తులకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
