లోకవాణి, అచ్చంపేట 30: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అచ్చంపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అప్ప శివ ఆధ్వర్యంలో భజన కార్యక్రమంతో పాటు పూజా కార్యక్రమాలు చేపట్టారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, సాయి నగర్ కాలనీ కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారి చేతుల మీదుగా వారికి ఆశీర్వచనం అందజేసి, అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి స్వామివారి కృప లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
