మన్నెవారిపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ

లోకవాణి, అచ్చంపేట 30: మన్నెవారిపల్లి గ్రామంలో మంగళవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. వెటర్నరీ డాక్టర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువుల ఆరోగ్యం కాపాడడమే లక్ష్యంగా ముందస్తు చర్యలుగా నట్టల మందు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గొర్రెల యజమానులు, గ్రామస్తులు పాల్గొని తమ పశువులకు మందు వేయించారు. ఇటువంటి కార్యక్రమాలు పశువుల వ్యాధులను నియంత్రించేందుకు ఉపయోగపడతాయని వెటర్నరీ సిబ్బంది తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe