అచ్చంపేటలో ఘనంగా సిపిఐ శతజయంతి ఉత్సవాలు


లోకవాణి, అచ్చంపేట 26: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతజయంతి ఉత్సవాల సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ చరిత్ర, ప్రజా ఉద్యమాల్లో సిపిఐ పాత్రను నేతలు వివరించారు. శతజయంతి ఉత్సవాలు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెరుముల గోపాల్, గాదేపరంధాములు, ఎం.డి. బషీర్, మాడుగుల నరసింహులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe