అమ్రాబాద్ : పాత్రికేయుడు మంతటి చెన్నయ్య మృతి

లోకవాణి, అచ్చంపేట 25: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు మంతటి చెన్నయ్య తెల్లవారుజామున ఉదయం 5 గంటల తరువాత అనారోగ్యంతో మృతి చెందారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, నిబద్ధతతో పాత్రికేయ సేవలు అందించిన ఆయన అకాల మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటుగా మారింది. ఈ విషాద సమయంలో మంతటి చెన్నయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Youtube Subscribe