అచ్చంపేటలో అనుమానాస్పద మృతి కేసు : ఇద్దరు నిందితుల అరెస్ట్

లోకవాణి, అచ్చంపేట 25: గత నెల నవంబర్ 24న అచ్చంపేట పట్టణంలో చోటు చేసుకున్న నేనావత్ లక్ష్మణ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిర్వహించిన విచారణలో, మృతుడు నేనావత్ లక్ష్మణ్ భార్య నేనావత్ పద్మతో పాటు అచ్చంపేటలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాత్లావత్ గోపి కలిసి లక్ష్మణ్‌ను హత్య చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఆధారాల నేపథ్యంలో అచ్చంపేట సీఐ నాగరాజు ఆదేశాల మేరకు నేనావత్ పద్మ మరియు రాత్లావత్ గోపీలను అరెస్ట్ చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

WhatsApp Join Now
Youtube Subscribe