లోకవాణి, అచ్చంపేట 09: అచ్చంపేట పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు “ప్రజా బాట” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వీధిని సందర్శించి వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి విద్యుత్ సరఫరాకు భద్రత కల్పించారు. ఈ పనులను చూసిన స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యుత్ శాఖపై నమ్మకం మరింత పెరుగుతుందని తెలిపారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
