బొమ్మనపల్లిలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 21: అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు డా. చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. కిష్ట తాండ, బాల్య తాండ, బొమ్మనపల్లి గ్రామాలకు ఈ కొత్త సబ్‌స్టేషన్ ద్వారా నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, సబ్‌స్టేషన్ నిర్మాణంతో తక్కువ వోల్టేజ్ సమస్యలు పూర్తిగా తగ్గి, రైతులకు వ్యవసాయ మోటార్లకు సకాలంలో సరిపడే విద్యుత్ లభిస్తుందని పేర్కొన్నారు. పంటల సాగులో ఇది రైతులకు పెద్ద మద్దతుగా మారుతుందని తెలిపారు. అలాగే గృహాలలో ఫ్యాన్లు, లైట్లు, గృహోపకరణాలకు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేందుకు కొత్త సబ్‌స్టేషన్ తోడ్పడుతుందని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసి, భవిష్యత్తులో విద్యుత్ రంగంలో మరిన్ని నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధిని పెంచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పనులను నాణ్యతతో పూర్తి చేసిన విద్యుత్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe