లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 21 : అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలోని కేజీబీవీ ఉన్నత పాఠశాలలో రూ.54 లక్షలతో ప్రహరీ, సీసీ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రహరీ నిర్మాణం వలన పాఠశాల ఆస్తుల రక్షణ, విద్యార్థినుల భద్రత మరింత మెరుగవుతాయని తెలిపారు. సీసీ రోడ్ల ఏర్పాటుతో వర్షాకాలంలో బురద సమస్యను తగ్గించి, పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, సౌకర్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి, ముఖ్యంగా బాలికా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కేజీబీవీ పాఠశాలలు పేద కుటుంబాల విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ నిర్మాణాలు పాఠశాల అభివృద్ధికి దోహదపడి, విద్యార్థినులు ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు దారి చూపుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కేజీబీవీ పాఠశాల అభివృద్ధికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
21
Nov
WhatsApp
Join Now
Youtube
Subscribe
