సామూహిక వివాహాలలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే దంపతులు

లోకవాణి, అచ్చంపేట, నవంబర్ : సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అచ్చంపేట పట్టణ కేంద్రం లోని ఒ ఫంక్షన్ హాల్ లో కౌన్సిల్లర్ అప్ప శివ నిర్వహించిన సామూహిక వివాహాలలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించారు. మొత్తం 65 నూతన జంటలు ఒక్కటయ్యారు. ఇంత భారీ స్థాయిలో సామూహిక వివాహాలు మొదటిసారిగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది గొప్ప సహాయం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 65 జంటలు వివాహం చేసుకుని అందరినీ కనువిందు చేశారని పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకుడు అప్పశివ, ఆయన కుటుంబ సభ్యులు, అలాగే నిర్వాహకుల బృందానికి నూతన వధూవరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe