లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 14: అచ్చంపేట పట్టణ కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు వివిధ ఆటపాటలతో సందడి చేశారు. టీచర్లు విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారు రోజువారీ తరగతుల్లో చేసే కార్యకలాపాలను స్కిట్ రూపంలో ప్రదర్శించి విద్యార్థులను అలరించారు. పాఠశాల ప్రాంగణం మొత్తం ఉత్సాహభరితంగా మారింది.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
