పెద్దకొత్తపల్లి విద్యార్థుల ప్రమాద ఘటనపై ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,
ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్, మండల విద్యాధికారికి షోకాస్ నోటీస్ జారీ
లోకవాణి, నాగర్కర్నూల్, నవంబర్: 11
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాతాపూర్ కు పుస్తకాలు తీసుకురావడానికి, పెద్ద కొత్తపల్లి మండల కేంద్రానికి వెళ్లి ప్రమాదానికి గురైన విద్యార్థుల ఘటనపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాతాపూర్ ప్రధానోపాధ్యాయుడిని సస్పెన్షన్, పెద్దకొత్తపల్లి మండల విద్యాధికారికి షోకాస్ నోటిస్ జారీ చేయాలని ఆదేశాల మేరకు సాతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం శ్రీశైలం ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ, పెద్దకొత్తపల్లి మండల విద్యాధికారి కే శ్రీనివాసరెడ్డికి షోకాస్ నోటీస్ జారీ చేసినట్లు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
