లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 06:నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలోని ఎస్.ఎన్.సి.యు. (Special Newborn Care Unit) విభాగాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. రవికుమార్ నాయక్, PO JDCH&I టీమ్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవలు, పరికరాల వినియోగం, మందుల లభ్యత, సిబ్బంది హాజరు తదితర అంశాలను సమీక్షించారు. డా. రవికుమార్ నాయక్ మాట్లాడుతూ, శిశువుల ఆరోగ్య సంరక్షణలో ఎస్.ఎన్.సి.యు. విభాగం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి శిశువు ఆరోగ్యవంతంగా బయటపడేలా వైద్య సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డా. ప్రభు, జెడిపిఓ సిహెచ్‌ఐ టీమ్ సభ్యులు పీటర్, డేవిడ్, బద్రి, శ్రీనాథ్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. శివ, డిపిఓ రేనయ్య, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాసులు, భగత్ తదితరులు పాల్గొన్నారు.
శిశు ఆరోగ్య సంరక్షణలో ఎస్.ఎన్.సి.యు. కీలకం : డిఎంహెచ్ఓ డా. రవికుమార్ నాయక్
06
Nov
WhatsApp
Join Now
Youtube
Subscribe
