విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించాలి : డిఈఓ

లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 06: విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సృజనాత్మక పద్ధతులు అవలంబించాలని డిఈఓ రమేష్ కుమార్ సూచించారు. గురువారం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల, అచ్చంపేట మండలంలోని చందాపూర్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించి, ఉపాధ్యాయులతో పరస్పర చర్చ జరిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి బోధనలో నాణ్యతను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe