డాక్యుమెంట్లు లేని వాహనాలపై పోలీసుల తనిఖీలు

లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 05: నాగర్కర్నూల్ జిల్లా  అచ్చంపేట పట్టణంలోని శివసాయి నగర్ కాలనీలో బుధవారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి పల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యాలీడ్ డాక్యుమెంట్లు ఉన్న వాహనాలనే నడపాలని సూచించారు. పోలీసులు 60 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు, ఎస్సైలతో పాటు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe