శిశుమందిర్ పాఠశాలలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 04:  అచ్చంపేట పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో కార్తిక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దీపాలను వెలిగించి అలంకరించారు. పూజా కార్యక్రమాలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు కార్తిక మాస ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి ఉత్సవాలు ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సంస్కృతిని పిల్లల్లో నింపుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe