వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

లోకవాణి న్యూస్, అక్టోబర్ 29: మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం తుర్కలపల్లి గ్రామంలో వరద పరిస్థితులను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులతో కలిసి పర్యటించి సమీక్షించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాగులు, చెరువులు ప్రవహిస్తున్న ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు.

WhatsApp Join Now
Youtube Subscribe