లోకవాణి, అక్టోబర్ 29: తుఫాను ప్రభావంతో అచ్చంపేట సబ్‌డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని అచ్చంపేట డివిజన్ డీఎస్పీ పల్లె శ్రీనివాస్ తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్లనుండి బయటకు రావొద్దని, పాత మట్టి ఇండ్లలో నివసించే వారు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. ప్రధాన రహదారులు వరద నీటితో నిండిపోయాయని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
