లింగాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రంగినేని శ్రీనివాస్ రావు

లోకవాణి న్యూస్, లింగాల : లింగాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ  ఆదేశాల మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ, అన్నదాతలకు అండగా ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద చిన్న, మధ్య తరహా రైతులకు యంత్రాలు, పనిముట్లు అందజేస్తున్నామని తెలిపారు. రైతులు తమ ధాన్యంలో తేమ, తాలు లేకుండా చూసుకోవాలని సూచిస్తూ, ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2,400 కనీస మద్దతు ధర ఇస్తుందని పేర్కొన్నారు. రైతులు PACS మరియు మార్కెట్ యార్డుల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, పట్టణ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చెంచేటి శివ, సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ముక్తార్, డైరెక్టర్లు మూడవత్ శంకర్, వెంకటయ్య, మాజీ సర్పంచులు మూడవత్ శ్రీశైలం, రాయవరం మల్లయ్య, కురువ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe