గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

అచ్చంపేట, అక్టోబర్ 23: అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ భవనంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) జిల్లా మూడవ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు పాల్గొని చర్చల్లో భాగమయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కమిటీని 46 మందితో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఆర్. శ్రీనివాసులు, జిల్లా యూనియన్ అధ్యక్షులు భత్తుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి పరశురాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుల్తాన్, కోశాధికారి మల్లేష్. కార్యదర్శివర్గ సభ్యులుగా రామకృష్ణ, రాములు, బాలస్వామి, సుబ్బయ్య, లింగస్వామి, మౌలాలి, గెల్వయ్య, చెన్నమ్మ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా శంకర్, నిరంజన్, గణేష్, శీను, వెంకటేష్, ఏమయ్యా, చిన్నమ్మ, ఇసాక్, వెంకటయ్య, సాదిక్, రమేష్ తదితరులు ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా ప్రతినిధులు సంఘీభావం వ్యక్తం చేస్తూ, గ్రామపంచాయతీ కార్మికుల హక్కుల సాధన కోసం ఏకమై కృషి చేయాలని నిర్ణయించారు.

WhatsApp Join Now
Youtube Subscribe