- రేపు బీసీల గళం మార్మోగాలి
- SC, ST, BC సంఘాలు ఏకతాటిపైకి రావాలి
- రేపటి బందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
అచ్చంపేట, అక్టోబర్ 17:
రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు సముచిత హక్కులు దక్కే వరకు పోరాటం ఆగదని యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కుందేల శంకర్ యాదవ్ అన్నారు. రేపు జరగనున్న తెలంగాణ బంద్ బీసీ స్వాభిమానానికి ప్రతీకగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా అన్ని ప్రభుత్వం కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయాలని, రోడ్లపై ఒక్క వాహనం కూడా తిరగరాదని ఆయన హెచ్చరించారు. బంద్‌ను అడ్డుకునే ప్రయత్నాలు ప్రజా ఆగ్రహానికి గురవుతాయని స్పష్టం చేశారు. రేపటి బంద్ బీసీల ఆకాంక్షలకు ప్రతీకగా, తెలంగాణ వ్యాప్తంగా SC, ST, BC సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీల్లోని బీసీ నాయకులు బంద్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
