నవంబర్ 9న వ్యాసరచన చిత్రలేఖన ఫోటీలు

అచ్చంపేట, అక్టోబర్ 16:  చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకొని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ (TPTF), నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట డివిజన్ ఆధ్వర్యంలో నవంబర్ 9న విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు టీపీటీఎఫ్  జిల్లా అధ్యక్షులు భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, సమాజంలో అవినీతి నిర్మూలన, నేటి సమాజంలో యువత పాత్ర వంటి అంశాలలో వ్యాస రచన పోటీలుంటాయన్నారు. 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక చిత్రలేఖన పోటీ నిర్వహిస్తామన్నారు. వారు ఏదైనా ఒక భారత జాతీయ నాయకుడి చిత్రాన్ని వేయాలని తెలిపారు. విద్యార్థులు తమ వ్యాసాలను ఇంగ్లీష్ లేదా తెలుగు భాషలో రాయవచ్చన్నారు. డివిజన్ స్థాయిలో మొదటి, రెండవ, మూడవ బహుమతులతో పాటూ, ప్రతి పాఠశాల నుండి ఉత్తమ వ్యాసరచయితకు ప్రత్యేక బహుమతి ఇవ్వబడుతుందన్నారు. ఈ పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, సమాజంపై అవగాహన పెంపొందించే దిశగా ముందడుగని నిర్వాహకులు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe