ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం


  • పెండింగ్ బిల్లులు సహా అన్ని అంశాలు పరిష్కార దిశగా: ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ
  • పెండింగ్ బిల్లులు, నిర్మాణ లోపాలు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు

అచ్చంపేట, అక్టోబర్ 14 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో కొత్తగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జిల్లా గృహ నిర్మాణ శాఖ (హౌసింగ్ డిపార్ట్మెంట్) అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. “లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, పెండింగ్ బిల్లులు, నిర్మాణ పనుల ఆలస్యం, లేఔట్ సమస్యలు మొదలైన అంశాలను త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రజల ఇళ్ల కల నిజం కావడంలో అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయం చూపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కూడా పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే అందరికీ తగిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

WhatsApp Join Now
Youtube Subscribe