పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ

నాగర్కర్నూల్, లోకవాణి న్యూస్, అక్టోబర్ 12

 

నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఏఐసీసీ పరిశీలకులు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామిను టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పుష్ప గుచ్చం అంద జేసీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలు, డీసీసీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ, స్థానిక రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.


 

WhatsApp Join Now
Youtube Subscribe