అచ్చంపేటలో ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభం

  • విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాల పెంపుదలకు ఎన్ఎస్ఎస్ శిబిరాలు దోహదం- జీవన్ కుమార్

 

  • సమాజ సేవతో నాయకత్వం నేర్చుకునే వేదికగా ఎన్ఎస్ఎస్ శిబిరం

అచ్చంపేట, అక్టోబర్ 9:

విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఎన్ఎస్ఎస్ శిబిరాలు దోహదపడతాయని మండల విద్యాధికారి జీవన్ కుమార్ తెలిపారు. గురువారం, అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల విద్యార్థులు సాయి నగర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మార్గదర్శక సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సుహాసిని, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ మహేశ్వర్ రెడ్డి, కళాశాల, పాఠశాల బృందం పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe