నికార్సైన కాంగ్రెస్ నాయకుడికి సముచిత స్థానం ఇవ్వాలి

  • కాంగ్రెస్ బలోపేతానికి కష్టకాలంలో కృషి చేసిన అజయ్ యాదవ్
  • పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన అజయ్ యాదవ్ దంపతులకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలి – యాదవ సంఘాల డిమాండ్
  • కష్టకాల నాయకుడికి గౌరవం దక్కాలంటూ కాంగ్రెస్ శ్రేణుల హోరాహోరీ డిమాండ్
  • జల్–జంగల్–జమీన్ నినాదం మాదిరే ప్రజల నమ్మకం గెలిచిన అజయ్ యాదవ్

అచ్చంపేట, అక్టోబర్ 7 (లోకవాణి న్యూస్ర్) కాంగ్రేస్ పార్టీ కీ కష్టకాలంలో కట్టుబడి ఉండి, అచ్చంపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి దశాబ్ద కాలంగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న యువ నాయకుడు బద్దుల అజయ్ యాదవ్ ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేయాలని సంకల్పించారు. అచ్చంపేట జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయిన నేపథ్యంలో, ఆయన సతీమణి బద్దుల మంజుల యాదవ్ కు టికెట్ కేటాయించాలని పలువురు కాంగ్రెస్ శ్రేణులు, యాదవ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కష్ట సమయాలలోనూ వెన్ను చూపలేదు. అప్పటి ప్రభుత్వం చేసిన అన్యాయాలు, ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి, పార్టీకి తన నిబద్ధతను నిరూపించుకున్నారు. 2014 నుంచి అచ్చంపేట మండల సోషల్ మీడియా విభాగంలో చురుకైన పాత్ర పోషించి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, తరువాత అసెంబ్లీ అధ్యక్షుడిగా యువతను సంఘటితం చేశారు. ప్రస్తుత అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అనేక ధర్నాలు, నిరసన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని పార్టీకి బలమైన మద్దతుగా నిలిచారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులు, బెదిరింపులు ఎదురైనా ఆయన వెనుకడుగు వేయలేదు. ప్రజల్లో అజయ్ యాదవ్కు ఉన్న మంచి పేరు, ప్రజాసంబంధాలు దృష్ట్యా పార్టీ అధిష్ఠానం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ పట్ల కట్టుబాటు, ప్రజల పట్ల సేవాభావం కలిగిన అజయ్ యాదవ్ సతీమణికి ఈసారి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు, యాదవ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అజయ్ యాదవ్ దంపతులు విజయం సాధిస్తే, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతిపై దృష్టి సారిస్తారని స్థానిక ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe