- ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహా యోధుడికి ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఘన నివాళి.
అచ్చంపేట, అక్టోబర్ 7 ( లోకవాణి న్యూస్ ) గిరిజనుల హక్కుల కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు కొమురం భీమ్ అని నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట డివిజన్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షులు భాస్కర్ అన్నారు. మంగళవారం కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణం కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జల్, జంగల్, జమీన్ — నీరు, అడవి, భూమి మాకే సొంతం’ అనే నినాదంతో గిరిజన సమాజ అభ్యున్నతికి జీవితాన్ని అర్పించిన మహానాయకుడు ఆయన” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతయ్య, క్రాంతి కుమార్, రాజు, శ్రీధర్, రాఘవేందర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
