సుప్రీంకోర్టు సీజేఐ పై దాడి హేయమైన చర్య

అచ్చంపేట, అక్టోబర్ 7:

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయి గారిపై మాజీ అడ్వకేట్ రాకేష్ కిషోర్ చేసిన దాడి ఘటనకు నిరసనగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అతని చిత్రపటాన్ని పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ..దళిత వర్గానికి చెందిన న్యాయమూర్తిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా రాకేష్ కిషోర్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం కోశాధికారి కుంకి విజయ్, న్యాయవాదులు లక్ష్మీనారాయణ, మస్తాన్, కొయ్యల శ్రీను, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశన్న యాదవ్, మాజీ ఎంపీపీ రామనాథం, బీసమల ఆనంద్, విష్ణుమూర్తి, కుల నిర్మూలన పోరాట కమిటీ నాయకులు లక్ష్మీనారాయణ, కుంద మల్లికార్జున్, అనిల్ కుమార్, కిన్నెర పాండు, మహబూబ్ అలీ, మోతే రాజు, శ్రీను, ప్రజా కవి గోపాల్, గంధం స్వామి, పెంటయ్య, రాజగోపాల్, విష్ణు, గణేష్, శంకర్, పర్వతాలు, బాబు, మీసాల ప్రభాకర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe