అచ్చంపేట, అక్టోబర్ 18: అమ్రాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కొత్త బస్టాండ్ సమీపంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు బీసీలకు న్యాయమైన వాటా లభించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తా రోకోలో బీసీ ఐక్యవేదిక మండల నాయకులు, కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
