లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 11: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజేందర్ అన్నారు. తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం అచ్చంపేట పట్టణం కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన మైనార్టీ వెల్ఫేర్ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉందని, విద్యారంగంలో అనేక పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు గుర్తుచేశారు. విద్యార్థులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. విద్య సమాజ అభివృద్ధికి మూలస్థంభమని, విద్యావంతులైన యువత దేశ భవిష్యత్తు అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉపన్యాసం వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మెన్ అంతటి మల్లేష్, దర్గా కమిటీ ఛైర్మెన్ రఫీ, మస్జీద్ సదాబ్ సిద్ధిక్ సహాబ్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఖాదర్, పాఠశాల ప్రిన్సిపాల్ యాదగిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేటలో ఘనంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం
11
Nov
WhatsApp
Join Now
Youtube
Subscribe
