వెల్టూర్ గ్రామంలో నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

లోకవాణి, అచ్చంపేట 22: ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం తహశీల్దార్ సమక్షంలో సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా చింతోజ్ వెంకటేష్, ఉపసర్పంచ్‌ గా ఉప్పరి మల్లయ్య బాధ్యతలు స్వీకరించారు. వీరితో పాటు 10 మంది వార్డు సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు

WhatsApp Join Now
Youtube Subscribe