లోకవాణి, అమ్రాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన ఎస్ఎం ట్రాన్స్పోర్ట్ అధినేత ఏనుపోతుల తిరుపతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లబావి, మాచారం, తుర్కపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు అవసరమైన ఎంట్రన్స్ పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, ఇతర స్టేషనరీ సామగ్రిని అందజేశారు.
తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ, నల్లమల ప్రాంత విద్యార్థులు విద్య ద్వారా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రేనయ్య, అంబాన్నారాయణ, దామోదర్, పర్వతాలు, విజయ్, జగన్, మహేష్, రఘుపతి, హుస్సేన్, అనిల్, సునీల్, ఉపాధ్యాయులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
