రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలు పంపిణీ

ఉప్పునుంతల, అక్టోబర్ 7:

ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO) ఆధ్వర్యంలో యాసంగి సాగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం రైతులకు వేరుశనగ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. NMEO-OS పథకం కింద ఒక్కో రైతుకు 90 కిలోల విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సీఈవో కొత్త రవీందర్ రావు, ఏఈఓ మంజుల, ఎఫ్ పీఒ సభ్యులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe