లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 06: మొంథా తుఫాన్ ప్రభావంతో అచ్చంపేట నియోజకవర్గంలో భారీ వర్షాలు కురవడంతో దెబ్బతిన్న రహదారులపై మరమత్తు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. అచ్చంపేట మండలంలోని సిద్దాపూర్–అక్కరం మార్గంలో కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ వెంటనే అధికారులను ఆదేశించి మరమత్తు పనులను చేయించారు. ప్రజల సౌకర్యం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
