మున్సిపాలిటికి ఆస్తి పన్ను చెల్లించిన ఆర్టీసీ

లోకవాణి, అచ్చంపేట, డిసెంబర్ 31: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ అధికారులు మున్సిపాలిటికి చెందిన ఆస్తి పన్నును చెల్లించారు. ఆర్టీసీ తరఫున మొత్తం ₹3,22,556 ఆస్తి పన్నుగా మున్సిపాలిటీకి జమ చేయడం జరిగింది. ప్రభుత్వ సంస్థలు తమ పన్ను బాధ్యతలను సకాలంలో నిర్వర్తించటం అభినందనీయమని మున్సిపల్ వర్గాలు పేర్కొన్నారు. ఈ ఆస్తి పన్ను మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe