లోకవాణి, అమ్రాబాద్, అక్టోబర్ 27: అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త బండ మల్లయ్య గారు గతవారం అకాల మరణం చెందడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అమ్రాబాద్ మండలం ఎన్నికల ఇన్‌చార్జి బల్మూరు జానకి సోమవారం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం నిచ్చారు. మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మల్లయ్య పార్టీ పట్ల చూపిన అంకితభావం ఎల్లప్పుడూ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కుటుంబ సభ్యులు భగవంతుడిని నమ్మి ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, పోలం నిరంజన్, బండ బాలరాజు, రంగినేని సురేష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
