లోకవాణి, అచ్చంపేట, డిసెంబర్ 31: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో కొనసాగుతున్న కల్వర్ట్ నిర్మాణ పనులను మున్సిపల్ ప్రజాప్రతినిధులు పరిశీలించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
