బల్మూర్: బాణాల గ్రామ ఆశ్రమ పాఠశాల పరిశీలన

లోకవాణి, అచ్చంపేట : బాణాల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ దేశ్య నాయక్ సూచించారు. ఈ మేరకు ఆయన పాఠశాలలను సందర్శించి అక్కడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థుల వసతి, భోజనం, విద్యాబోధన, మౌలిక సదుపాయాల అంశాలపై చర్చించి, అవసరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సూచించారు.

WhatsApp Join Now
Youtube Subscribe